ముషీరాబాద్, వెలుగు: ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం రూ.6 వేల పింఛన్ ఇవ్వాలని డెవలప్మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ అధ్యక్ష, కార్యదర్శులు వల్లభనేని ప్రసాద్, భారతి డిమాండ్ చేశారు. బుధవారం డెఫ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో మూగ సైగలతో వినూత్న నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దివ్యాంగులకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని, జాబ్ క్యాలెండర్‌లో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో డెఫ్ ప్రతినిధులు నరసింహా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
