- కాలనీల్లో స్క్రాప్ వాహనాలుంటే నోటీసులు
- షాపుల్లో డస్ట్‌బిన్స్ లేకపోతే జరిమానా
- సీఎంసీ కమిషనర్ సృజన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఇంటి చుట్టుపక్కల ఎవరైనా చెత్త వేసినా, శుభ్రంగా ఉంచుకోకపోయినా యజమానులకు జరిమానా విధిస్తామని సీఎంసీ కమిషనర్ సృజన హెచ్చరించారు. హైదర్ నగర్ డివిజన్ లోని బృందావన్ కాలనీలో మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. కాలనీలోని పలు ప్రాంతాలను పరిశీలించిన ఆమె ఇండ్ల చుట్టూ చెత్త వేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే ఓ దుకాణాన్ని తనిఖీ చేసిన కమిషనర్ శానిటేషన్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఫైర్ అయ్యారు.
కాలనీల్లో రోడ్ల పక్కనున్న స్క్రాప్ వాహనాలను గుర్తించి నోటీసులు అతికించాలని, తర్వాత తొలగించాలన్నారు. షాపులను చెక్‌చేయాలని, డస్ట్‌బిన్లు లేకపోతే ఫైన్లు వేయాలన్నారు. ఈ సందర్భంగా ఓ స్వచ్ఛ ఆటో డ్రైవర్‌తో మాట్లాడారు.
రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో మాట్లాడగా వారు ఆక్రమణలపై ఫిర్యాదు చేశారు. దీంతో టౌన్ ప్లానింగ్ విభాగంతో కలిసి స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి అధికారులను ఆదేశించారు. వెర్టెక్స్ అపార్ట్‌మెంట్స్ వద్ద ఆటో డ్రైవర్లు రోడ్లపై వాహనాలు పార్క్ చేస్తున్నారని, దీంతో స్వీపింగ్చేయడానికి కష్టమవుతుందని తెలిసి తొలగించాలని సూచించారు. రోడ్లపై కేబుల్ వైర్లు వేలాడుతుండడంతో యాక్షన్తీసుకోవాలన్నారు. అలాగే, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
