అప్పుల బాధ‌లు భ‌రించ‌లేక చెరుకు వ్యాపారి ఆత్మ‌హ‌త్య‌

అప్పుల బాధ‌లు భ‌రించ‌లేక చెరుకు వ్యాపారి ఆత్మ‌హ‌త్య‌

సికింద్రాబాద్: అప్పుల వాళ్ళ వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక కిరణ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలోని అడ్డగుట్టలో జ‌రిగిందీ ఘటన. చెరుకు వ్యాపారి అయిన కిరణ్ పై కరోన ప్రభావం తీవ్రంగా పడింది. ఎండాకాలంలోనే కరోన ప్రారంభం కావడంతో తన వ్యాపారాన్ని బాగా దెబ్బతీసింది. అది చాలదన్నట్లు నగరంలోని ఎడ‌తెరపి లేకుండా కురిసిన వ‌ర్షం, వరదల కారణంగా అత‌ని చెరుకు గోడౌన్ కూలిపోవ‌డంతో మరింత అప్పుల్లో కురుకుపోయాడు. వ‌డ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వసూళ్లు చేయడమే కాకుండా వేధింపులకు గురిచేయ‌డం, గుర్తు తెలియని వ్యక్తులను త‌న ఇంటికి పంపించి బెదిరింపులకు పాల్ప‌డడంతో మ‌నస్థాపానికి గుర‌య్యాడు. భార్య, తల్లి, త‌న‌ బస్తీ వాళ్ళ ముందు జరిగిన అవమానాన్ని భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ సీలింగ్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోను తన సోదరికి పంపాడు కిరణ్. పోలీసు వాళ్లకు మరియు తన కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టి ఉరివేసుకొని చ‌నిపోయాడు . మృతుడికి భార్య , 10 ఏళ్ల లోపు వయసు గల ముగ్గురు సంతానం (ఇద్దరు కూతుళ్లు..ఒక కొడుకు) ఉన్నారు.