రికార్డుస్థాయిలో సిప్ పెట్టుబడులు

రికార్డుస్థాయిలో సిప్ పెట్టుబడులు

మ్యూచువల్ ఫండ్లలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్ (సిప్​) పెట్టుబడులు 2025 లో రికార్డు స్థాయికి చేరాయి. గత ఏడాది మొత్తం రూ.3.34 లక్షల కోట్లు సిప్​ల రూపంలో వచ్చాయి. 2024 లో ఈ పెట్టుబడుల విలువ రూ.2.68 లక్షల కోట్లుగా ఉండగా, 2023 లో రూ.1.84 లక్షల కోట్లు ఉంది.  దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. 

డిసెంబర్ నెలలో సిప్​ పెట్టుబడుల విలువ రూ.31 వేల కోట్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇవి రూ.29 వేల కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా పెట్టుబడిదారులు సిప్​లపై నమ్మకం ఉంచారని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ 21 శాతం పెరిగి డిసెంబర్ చివరికి రూ.80.23 లక్షల కోట్లకు చేరుకుంది.