కోర్టు తీర్పును బట్టి ఎన్నికలపై నిర్ణయం : వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం

కోర్టు తీర్పును బట్టి ఎన్నికలపై నిర్ణయం : వయనాడ్ ఉప ఎన్నికపై ఎన్నికల సంఘం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు పడడంతో వయనాడ్ ఉప ఎన్నికపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్న కేరళ  వయనాడ్ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పందించింది. రాహుల్ గాంధీకి కోర్టు 30రోజుల సమయం ఇచ్చిందని తెలిపింది. గడువు ముగిశాక కోర్టు తీర్పును బట్టి ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక కర్నాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

రాహుల్ గాంధీకి ఎంపీగా అనర్హత వేటు వేయడంతో లోక్ సభ సెక్రటేరియట్ కీలక నిర్ణయం ప్రకటిస్తూ ఆయన నోటీసులు జారీ చేసింది. తాను ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ నోటీసులపై స్పందించిన రాహుల్ గాంధీ.. త్వరలోనే తాను తాను ఉంటున్న అధికారిక బంగ్లా ఖాళీ చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియెట్ కు మంగళవారం ఆయన లేఖ రాశారు. ‘‘12 తుగ్లక్ లేన్​లో నాకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని మీరు రాసిన లెటర్ అందింది. అందుకు కృతజ్ఞతలు. నా హక్కులకు భంగం కలగకుండా, లెటర్​లో మీరు పేర్కొన్న మేరకు బంగ్లాను ఖాళీ చేస్తాను. నేను నాలుగు సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికై ఇదే బంగ్లాలో ఉంటున్నాను. ఇక్కడ నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి” అని లేఖలో రాహుల్ పేర్కొన్నారు.
.