నిరుద్యోగ యువ‌త‌కు అల‌ర్ట్: నిలిచిపోయిన‌ UPSC, SSC ప‌రీక్ష‌ల‌పై కేంద్రం ప్ర‌క‌ట‌న‌

నిరుద్యోగ యువ‌త‌కు అల‌ర్ట్: నిలిచిపోయిన‌ UPSC, SSC ప‌రీక్ష‌ల‌పై కేంద్రం ప్ర‌క‌ట‌న‌

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా వేలాది ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు ఇచ్చిన నోటిఫికేష‌న్ల‌కు సంబంధించిన ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. మార్చి 20 – 28 మ‌ధ్య‌ జరగాల్సిన కంబైన్డ్ హైయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) టైర్-1 పరీక్షల‌ను, మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగాల్సిన జూనియర్ ఇంజనీర్ (JE) ఎగ్జామ్ ను క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో వాయిదా వేస్తూ మార్చి 19న నిర్ణ‌యం తీసుకుంది SSC. అలాగే యూపీఎస్సీ సివిల్ స‌ర్వీసెస్-2019 మెయిన్ ఎగ్జామ్, ఇండియ‌న్ ఎక‌న‌మిక్ సర్వీస్, ఇండియ‌న్ స్టాటిక‌ల్ స‌ర్వీస్ ఎగ్జామ్స్ కూడా క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. అలాగే సివిల్ స‌ర్వీసెస్ -2020 ప్రిలిమ్స్, ఇంజ‌నీరింగ్ స‌ర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్, జియాజిస్ట్ స‌ర్వీసెస్ మెయిన్ ఎగ్జామ్ జ‌రిగాల్సి ఉంది. ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై మే 3న లాక్ డౌన్ ముగిసిన త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఇవాళ కేంద్రం ప్ర‌క‌టించింది.

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC), స్లాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (SSC) ప‌రీక్ష‌లను ర‌ద్దు చేయ‌బోమ‌ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్ప‌ష్టం చేశారు. ఆ ప‌రీక్ష‌లను ఎప్పుడు నిర్వహించాల‌న్న దానిపై మే 3 త‌ర్వాత నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. ప‌రీక్ష‌లకు ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి ఇబ్బందులు లేకుండా లాక్ డౌన్ ముగిసిన త‌ర్వాత ఎగ్జామ్ డేట్స్ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. అభ్య‌ర్థులంతా వారివారి ఊర్ల నుంచి ఎగ్జామ్ సెంట‌ర్ల‌కు వెళ్లేందుకు స‌రిప‌డా స‌మ‌యం ఉండాలా ముందుగానే తేదీల‌ను నిర్ణ‌యించి, తెలియ‌జేస్తామ‌ని చెప్పారు.