కరోనాతో అనాథలుగా మారిన... పిల్లల సంక్షేమానికి రూ.430 కోట్లు : తమిళనాడు ప్రభుత్వం

 కరోనాతో అనాథలుగా మారిన...  పిల్లల సంక్షేమానికి రూ.430 కోట్లు  : తమిళనాడు ప్రభుత్వం

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు తమిళనాడు ప్రభుత్వం రూ.430 కోట్లు కేటాయించింది. అనాథలుగా మారిన  382 మంది చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. తల్లి లేదా తండ్రిని కోల్పోయిన 13 వేల 682 మంది పిల్లల పేరున రూ.3 లక్షలు డిపాజిట్ చేయనుంది. 18 ఏళ్లు వచ్చాక ఈ డబ్బులు  వడ్డీతో సహా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. దీనికి అదనంగా బాలికల సంరక్షణకు రూ.239 కోట్లు కేటాయించింది.

 ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లు నెలకు రూ.1000 ఆదా చేసుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. అలాగే పుధుమై పెన్  పథకం కింద 2.73 లక్షల మంది బాలికలకు రూ.1000 అందజేస్తోంది.తమిళనాడు ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా 18.50 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యయనం ప్రకారం ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత తరగతి గది హాజరు శాతం పెరిగింది.