హైదరాబాద్,వెలుగు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షల టైమ్ టేబుల్‌ను అధికారులు రిలీజ్ చేశారు. 2025–-27 విద్యాసంవత్సరం బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన అభ్యర్థులకు మే 25 నుంచి 31 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని తెలిపారు. మే 25న చైల్డ్‌హుడ్ అండ్ లెర్నింగ్ పేపర్‌తో ప్రారంభమై.. 31న పెడగోగి అక్రాస్ కరిక్యులం పేపర్‌తో ముగుస్తాయని వెల్లడించారు.
డీపీఎస్ఈ ఎగ్జామ్స్ కూడా...
ఈనెల 25 నుంచి 30 వరకూ డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) ఫస్టియర్ ఎగ్జామ్స్ ఉంటాయని పీవీ శ్రీహరి తెలిపారు. మే 25న ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్, 26న చైల్డ్ డెవలప్‌మెంట్ తో పాటు 27,28,30 తేదీల్లో పరీక్షలు ఉంటాయని చెప్పారు.
