
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీఈడీ, డీపీఎస్ఈ రెండేండ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 25న డీఈఈసెట్ నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుకు 43,615 మంది అప్లై చేసుకున్నారని డీఈఈసెట్ కన్వీనర్ జి.రమేశ్ తెలిపారు. దీంట్లో తెలుగు మీడియం అభ్యర్థులు 19,900 మంది, ఇంగ్లిష్ మీడియంలో 22,051 మంది, ఉర్దూ మీడియంలో 1,664 మంది ఉన్నారు. ఆదివారం జరిగే ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తామని చెప్పారు.
ఫస్ట్ సెషన్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తెలుగు మీడియం అభ్యర్థులకు, సెకండ్ సెషన్లో ఇంగ్లిష్ మీడియం, ఉర్దూ మీడియం అభ్యర్థులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంట వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. అభ్యర్థులను నిర్ణీత టైమ్ కు గంటన్నర ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు.