- ఈ నెలాఖరులో నోటిఫికేషన్
హైదరాబాద్, వెలుగు: డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే డీఈఈసెట్– 2026 షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 21,22 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.
పరీక్ష తేదీలు ఖరారైనా.. పూర్తి నోటిఫికేషన్ మాత్రం ఫిబ్రవరి చివరి వారంలో వస్తుందని చెప్పారు. ప్రభుత్వ డైట్ కాలేజీలతో పాటు, ప్రైవేటు కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
