V6 News

కేటీఆర్, హరీశ్ రావుపై పరువు నష్టం దావ..నాంపల్లి కోర్టులో వేసిన సంపత్ కుమార్ 

కేటీఆర్, హరీశ్ రావుపై పరువు నష్టం దావ..నాంపల్లి కోర్టులో వేసిన సంపత్ కుమార్ 

బేగంబజార్, వెలుగు: ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్​రావు, బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్, నమస్తే తెలంగాణ పత్రిక, తెలుగు స్క్రైబ్ యాజమాన్యంపై బుధవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. అలంపూర్‌‌‌‌లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించి పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు.

జన్వాడ ఫామ్​హౌస్‌‌‌‌లో రచించిన కట్టుకథలను తమ అనుబంధ పత్రికల్లో వేయించారన్నారు. ఒక కాంట్రాక్టర్ ను తాను రూ.8 కోట్లు అడిగినట్లు అసత్య ప్రచారం చేశారని తెలిపారు. సదరు కాంట్రాక్టర్ స్థానికంగా ఓ వ్యక్తికి రూ.8 లక్షలు చెల్లించకుండా వేధించడంతో.. తాను ఫోన్ చేసి ఆ డబ్బులు చెల్లించాలని సూచించానన్నారు. ఒకప్పుడు రూ.30 కోట్లు ఇస్తామని, పార్టీ మారాలని హరీశ్​రావు తనను అడిగారని ఆరోపించారు.