తాత్కాలిక బడ్జెట్ 2024 వచ్చేసింది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ తాత్కాలిక బడ్జెట్ లో ఏయే శాఖలకు ఎంతెంత నిధులు కేటాయించారు అనేది చూద్దాం.. అత్యధికంగా రక్షణ శాఖకు ఇచ్చారు. ఎంతో తెలుసా.. అక్షరాల 6 లక్షల కోట్లు.. అత్యంత తక్కువ బడ్జెట్ ఏ శాఖకో తెలుసా.. వ్యవసాయానికి.. కేవలం లక్షా 27 వేల కోట్లు మాత్రమే.. మిగతా శాఖల వివరాలు కూడా చూద్దాం..
>>> రక్షణ శాఖకు రూ.6.1 లక్షల కోట్లు
>>> రవాణా, జాతీయ రహదారులకు రూ.2 లక్షల 78 వేల కోట్లు
>>> రైల్వే శాఖకు రూ.2 లక్షల 55 వేల కోట్లు
>>> పౌర సరఫరాల శాఖకు రూ.2 లక్షల 13 వేల కోట్లు
>>> హోం శాఖకు రూ.2 లక్షల 3 వేల కోట్లు
>>> రూరల్ డెవలప్ మెంట్ రూ. ఒక లక్షా 77 వేల కోట్లు
>>> రసాయనాలు, ఎరువుల శాఖకు రూ. ఒక లక్షా 68 వేల కోట్లు
>>> టెక్నాలజీ, కమ్యూనికేషన్ శాఖకు రూ. ఒక లక్షా 37 వేల కోట్లు
>>> వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ. ఒక లక్షా 27 వేల కోట్లు
తాత్కాలిక బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి. అత్యధికంగా రక్షణ శాఖకే నిధులు వెళుతున్నాయి. అన్నం పెట్టే రైతన్న శాఖ అయిన వ్యవసాయానికి మాత్రం కేవలం ఒక లక్షా 27 వేల కోట్లు మాత్రమే కేటాయించటం ద్వారా మోదీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. దేశ రక్షణ అనేది అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశంగా సుస్పష్టం చేసింది.