ప్రపంచ సంక్షేమం కోసమే సూపర్ పవర్గా భారత్ ఎదగాలనుకుంటున్నం:రాజ్ నాథ్ సింగ్

ప్రపంచ సంక్షేమం కోసమే  సూపర్ పవర్గా భారత్ ఎదగాలనుకుంటున్నం:రాజ్ నాథ్ సింగ్


ప్రపంచ సంక్షేమం కోసం భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదగాలని కోరుకుంటున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇతర దేశాలపై ఆదిపత్యం కోసమో..లేక ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకోవడం కోసమో తాము...సూపర్ పవర్ గా మారాలనుకోవడం లేదన్నారు.  ఢిల్లీలో జరిగిన FICCI 95వ వార్షిక సదస్సులో రాజ్‌నాథ్‌ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌ను సూపర్‌ పవర్‌గా మార్చడానికి అవసరమైన ఐదు అంశాలను  ప్రధాని మోడీ తన ఎర్రకోట ప్రసంగంలో వెల్లడించినట్లు  తెలిపారు. 

దేశ రక్షణ కోసం సైనికులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. గల్వాన్ లేదా తవాంగ్ ..ఏ ప్రాంతమైనా..జవాన్లు తమ శౌర్య పరాక్రమాలను నిరూపించుకున్నారని చెప్పారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని..సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు ప్రశంసనీయమన్నారు. 

https://twitter.com/ANI/status/1603978526352605185

చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే భారత ప్రభుత్వం నిద్ర పోతోందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ  చేసిన వ్యాఖ్యలపై రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. విపక్షాల ఉద్దేశం ఏంటో తాము ఎప్పుడూ ప్రశ్నించలేదన్నారు. ఏ పార్టీ అయినా..వారి పార్టీల విధానాలు వాస్తవాలపై ఆధారపడి ఉండాలన్నారు. కానీ అవాస్తవాలను ప్రచారం చేస్తూ  రాజకీయాలు చేయకూడదని రాజ్ నాథ్ సింగ్ సూచించారు.