విద్యార్థుల ఫైట్.. శవాన్ని పూడ్చిపెట్టిన స్కూల్ యాజామాన్యం

విద్యార్థుల ఫైట్.. శవాన్ని పూడ్చిపెట్టిన స్కూల్ యాజామాన్యం

డెహ్రాడూన్ : భావి తరాలకు మార్గదర్శకంగా ఉండాల్సిన విద్యార్థులు రౌడీల్లా మారుతున్నారనడానికి ఈ సంఘటనే ఉదాహారణ. ఫ్రెండ్లీగా కలిసిమెలిసి చదువుకోవాల్సిన స్లూడెంట్స్ కొట్టుకుచచ్చారు. పిడిగుద్దులు గుద్దకున్నారు. ఈ ఘర్షణలో ఓ విద్యార్థి చనిపోయిన దారుణ సంఘటన ఉత్తారాఖండ్ లో జరిగింది. ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యం బయటికి రాకుండా దాచిపెట్టినప్పటికీ ఆలస్యంగా బయటపడింది. సీనియర్స్ జూనియర్స్ పై ర్యాగింగ్ వ్యవహారమే ఇందుకు కారణం.

వాసుయాదవ్ అనే 12ఏళ్ల విద్యార్థి డెహ్రాడూన్ లోని  ఓ బోర్డింగ్ స్కూల్ లో చదువుతున్నాడు. తన సీనియర్స్ తో జరిగిన గొడవ పెద్దదిగా మారడంతో.. వాసుని సీనియర్స్ క్రికెట్ బ్యాట్స్ తో కొట్టి చంపేశారు. విషయం తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం వెంటనే బాలుడిని డాక్టర్లకు చూపించారు. బాలుడు అప్పటికే చనిపోయాడని తెలిపారు డాక్టర్లు. దీంతో.. వెంటనే బాలుడి డెడ్ బాడీని స్కూల్ ఆవరణలో పూడ్చి పెట్టారు. ఈ విషయం స్టూడెంట్స్ మృతుడి తల్లిదండ్రులకు చెప్పడంతో..పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేశాడనే అనుమానంతో.. ఆ బాలుడిని సీనియర్ విద్యార్థులు దారుణంగా కొట్టారట.  బాలుడిపై దాడి మధ్యాహ్నం జరగగా.. సాయంత్రం వరకు ఆస్పత్రికి తీసుకువెళ్లలేదని.. ఆలస్యం కారణంగానే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెబుతున్నారు. కనీసం బాలుడి పేరెంట్స్ కి కూడా ఈ విషయం స్కూల్ యాజమాన్యం తెలియజేయకపోవడంతో సీరియస్ అవుతున్నారు గ్రామస్థులు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.