ఢిల్లీ ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్.. AQI 400 దాటింది

ఢిల్లీ ప్రమాదకర స్థాయిలో పొల్యూషన్.. AQI 400 దాటింది

ఢిల్లీలో పొల్యూషన్​ ప్రమాదకర స్థాయిక చేరింది. గురువారం( అక్టోబర్​30) ఢిల్లీ మొత్తం గాలి నాణ్యత బాగా దిగజారింది. అక్షర్​ ధామ్​ లో AQI 400  దాటింది. NCR ప్రాంతాల్లో 350 కి పైగానే AQI నమోదు అయింది. దీంతో ఢిల్లీ ప్రజలు ఊపరి పీల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. 

ఢిల్లీ దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో గురువారం చలి, దట్టమైన పొంగమంచు,  రికార్డు స్థాయిలో పొల్యూషన్​ పెరిగింది. కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) తెలిపిన వివరాల ప్రకారం. అక్షర్​ ధామ్​ లో  గాలి నాణ్యత 409కి చేరింది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. 

దీంతో ఢిల్లీ అంతటా ప్రజలు కళ్లు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంలో ఢిల్లీ మొత్తం  చీకట్లు కమ్ముకున్నాయి. 
కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణం గాలి వేగం తగ్గడమేనని నిపుణులు అంటున్నారు.గంటకు 14 కి.మీ వేగంతో వీచే గాలులు ఇప్పుడు గంటకు 10 కి.మీ.కు తగ్గాయి. దీంతో కాలుష్య కారకాలు అలాగే ఉండిపోయాయి. పగటిపూట దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉంది.