24 గంటల్లోనే ఢిల్లీ అసెంబ్లీకి రెండో సారి బాంబు బెదిరింపు

24 గంటల్లోనే ఢిల్లీ అసెంబ్లీకి రెండో సారి బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ: 24 గంటల్లోనే ఢిల్లీ అసెంబ్లీకి రెండోసారి బాంబు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం (మార్చి 24) ముఖ్యమంత్రి రేఖా గుప్తా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందే అసెంబ్లీలో బాంబ్ పెట్టామంటూ గుర్తు దుండగులు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే.. బుధవారం (మార్చి 25) మరోసారి అసెంబ్లీకి ఢిల్లీ బాంబ్ బెదిరింపు మొయిల్ వచ్చింది. 

అసెంబ్లీలో బాంబ్ పెట్టినట్లు అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు మెయిల్ పంపారు గుర్తు తెలియని దుండగులు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సంస్థలు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వ్కాడ్ అసెంబ్లీ ప్రాంగణం, దాని చుట్టుపక్కలా ముమ్మరంగా తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 బాంబు బెదిరింపుల నేపథ్యంలో అసెంబ్లీ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈమెయిల్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్ నిపుణులు, భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయి. మెయిల్ పంపినవారిని గుర్తించేందుకు ఐపీ ట్రాకింగ్, ఈమెయిల్ హెడర్ విశ్లేషణ వంటి సాంకేతిక నిఘాను ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.