ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు..బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు..బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం (జూలై16)  ఢిల్లీలో రెండు స్కూళ్లలో బాంబులు పెట్టామని బెదిరింపులు ఈమెయిల్స్ వచ్చాయి. ద్వారాకలోని సెయింట్ థామస్ స్కూల్, వసంత్ కుంజ్ లోని వసంత్ వ్యాలీ స్కూల్ కు ఈ బెదిరింపులు వచ్చాయి. స్కూల్ ఆవరణలో పేలుడు పదార్థాలు అమర్చాం ఈ మెయిల్స్ రావడంతో విద్యార్థులు , పేరెంట్స్ భయాందోళనకు గురయ్యాయి. 

విషయం తెలుసుకన్న పోలీసులు వెంటనే రెండు స్కూళ్లకు వెళ్లి తనఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లు, సైబర్ నిపుణులు బృందం తనిఖీలు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు ,సిబ్బందిని స్కూల్ బయటికి పంపించారు.  

రెండు స్కూళ్ళ క్యాంపస్‌లలో భద్రతా బృందాలు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించాయి. అయితే ఈ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు. మరోవైపు బెదిరింపు ఇమెయిల్ ఎక్కడినుంచి వచ్చాయి.. ఎవరు పంపించారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పంపినవారిని గుర్తించే ప్రయత్నంలో పనిలో పడ్డారు సైబర్ క్రైమ్ నిపుణులు. 

సోమవారం ఉదయం కూడా ఢిల్లీలో మూడు స్కూళ్లకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు స్కూళ్లు, భారత నావికాదళం నడుపుతున్న ఒక పాఠశాలకు - సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు ,పాఠశాల అధికారులలో భయాందోళనలను రేకెత్తించింది. అయితే పూర్తి భద్రతా తనిఖీల తర్వాత అధికారులు ఈ బాంబు బెదిరింపులు నకిలీవిగా తేల్చారు పోలీసులు.