ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు: వైట్ కార్ పేల్చేసి రెడ్ కారులో ఎస్కేప్.. Ford EcoSport కారు కోసం పోలీసుల వేట

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు: వైట్ కార్ పేల్చేసి రెడ్ కారులో ఎస్కేప్.. Ford EcoSport కారు కోసం పోలీసుల వేట

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడి కోసం దర్యాప్తు స్పీడ్ పెంచిన పోలీసులకు.. కేసు లోతుల్లోకి వెళ్లే కొద్ది కొత్త కొత్త ఎవిడెన్స్ దొరుకుతున్నాయి. ఈ కేసులో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫోర్డ్ కంపెనీకి చెందిన రెడ్ ఎకో స్పోర్ట్(Ford EcoSport) కారు కోసం వేట మొదలెట్టారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లలో హ్యుందాయ్ ఐ20 (Hyndai i20) కారును పేల్చేసి ఫోర్డ్ కారులో పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. 

నిందితులు ఫోర్డ్ కారులో ఎస్కేప్ అయినట్లు అనుమానించిన పోలీసులు.. మూడు రాష్ట్రాల్లోని పోలీసు టీమ్ లను అలర్ట్ చేశారు.  DL10CK0458 అనే నెంబర్ ఉన్న కారు కోసం పోలీసులు  హంటింగ్ మొదలెట్టారు.  

మూడు రాష్ట్రాల్లోని ఎర్ర Ford EcoSport కార్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఆ నంబర్ ఉన్న కారును గుర్తించాలని ఆర్డర్స్ పాస్ చేశారు. కారు ఉమర్ ఉన్ నబీ పేరున రాజైరి గార్డెన్ ఆర్టీఓలో 2017 నవంబర్ 17 న రిజిస్టర్ అయినిట్లు పోలీసులు పేర్కొన్నారు. నబీ ఈ కారుకు సెకండ్ ఓనర్ గా గుర్తించారు పోలీసులు. అన్ని ఏరియాల్లోని పోలీసులు పికెటింగ్ నిర్వహించాలని.. ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు అధికారులు. 

భారీ పేలుడుతో సోమవారం (నవంబర్ 11) దేశరాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్ట్‎లో ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.