Delhi Capitals: ఐపీఎల్-2026లో ఏప్రిల్ 8న అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ సస్పెన్స్ థిల్లర్ సినిమాను తలపించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అద్భుతమైన ఇన్నింగ్స్ హీరోగా నిలుస్తాడని అనుకున్న డేవిడ్ మిల్లర్ చేసిన ఒక్క తప్పిదంతో విలన్ గా మారాడు. చివరి ఓవర్ వేసిన ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్ లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు కావాలి.. తొలి బంతిని విప్రజ్ నిగమ్ ఫోర్ కి తరలించాడు.. కానీ ఆ తర్వాతి బంతికి అతడు ఔటయ్యాడు.
ఇక 3వ బంతికి కుల్దీప్ మిల్లర్ కి సింగిల్ ఇవ్వగా.. నాలుగో బంతిని మిల్లర్ భారీ సిక్స్ కొట్టాడు. దీంతో ఢిల్లీ విజయానికి చివరి రెండు బంతుల్లో 2 పరుగులు అవసరం అయ్యాయి. ఐదో బంతికి సింగిల్ తీసే అవకాశం ఉన్నప్పటికి మిల్లర్ రన్ తీసుకోలేదు.. స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకుని మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నాడు మిల్లర్. కానీ అతడు అనుకున్నది మాత్రం అక్కడ జరగలేదు. లాస్ట్ బంతి ప్రసిద్ధి బౌన్సర్ వేయడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేదు. బై రన్ కోసం పరిగెత్తగా.. జోస్ బట్లర్ స్టంప్సన్న గిరాటేయడంతో.. ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓడిపోయింది.
ఐదో బంతికి సింగిల్ రన్ తీసి ఉంటే మ్యాచ్ కనీసం టై అయి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ న కోల్పోవాల్సి వచ్చింది. ఓడిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో మిల్లర్ కన్నీటి పర్యంతమయ్యాడు. సహచర ప్లేయర్స్ అతడ్ని ఓదార్చారు. అయితే ఈ మ్యాచ్ ఓడింది ఢిల్లీ డేవిడ్ మిల్లర్ వల్ల కాదని, ఓ ఐసీసీ రూల్ వల్ల ఓడిపోయిందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ 9 ఓవర్ లో నిస్సాంక పెవిలియన్ కి వెళ్లిన తర్వాత నితీష్ రాణా క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 10వ ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్లో రెండో బంతి నితీష్ ప్యాడ్లకు తగలడంతో.. అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే అవుట్ అని ప్రకటించాడు. అప్పటికే రాహుల్, నితీశ్ ఒక పరుగు కంప్లీట్ చేసేశారు. నితీష్– రాహుల్ తో డిస్కషన్ చేసిన తర్వాత రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి క్లియర్ గా బ్యాట్ ఎడ్జ్ తాకినట్లు కనిపించడంతో.. అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
Also Read : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో.. కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్
నితీష్ రాణా తీసిన ఆ పరుగుని పరిగణలోకి తీసుకోలేదు.. ఐసీసీ లా 20.1.1.3 ప్రకారం.. అంపైర్ ఒక బ్యాటర్ను అవుట్ గా ప్రకటించిన తర్వాత ఆ బంతి 'డెడ్ బాల్' అవుతుంది. అనంతరం బంతి బౌండరీకి వెళ్లినా పరిగణలోకి తీసుకోరు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో అదే జరిగింది.. ఈ ఒక్క నిర్ణయంతో అప్పటికే బాల్ డెడ్ కావడంతో బ్యాటర్లు తీసిన ఆ పరుగును ఇచ్చేందుకు అంపైర్లు నిరాకరించారు. చివరికి ఢిల్లీ జట్టు కేవలం 1 రన్ తేడాతోనే ఓడిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
