DC vs KKR: 22 ఫోర్లు, 18 సిక్సులు.. హోరెత్తిన విశాఖపట్టణం

DC vs KKR: 22 ఫోర్లు, 18 సిక్సులు.. హోరెత్తిన విశాఖపట్టణం

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విధ్వంసం ఆగేలా కనిపించడం లేదు. ప్రత్యర్థి ఏదైనా దంచి కొడుతున్నారు. బౌలర్ ఎవరైనా చుక్కలు చూపిస్తున్నారు. ఏ జట్టులోనైనా ఒకరిద్దరు విధ్వంసం సృష్టిస్తారు. కానీ కేకేఆర్ జట్టు మొత్తం విధ్వంసకర ఆటగాళ్లతో నిండిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పరుగుల దాహాన్ని తీర్చుకున్నారు. నరైన్ ఊచకోతకు తోడు రఘువంశీ, రస్సెల్, అయ్యర్ మెరుపులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్ తొలి రెండు ఓవర్లలో 17 పరుగులతో పర్వాలేదనిపించింది. అయితే మూడో ఓవర్ నుంచి అసలైన అసలైన విధ్వంసం సాగింది. ఖలీల్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ఇక ఇశాంత్ శర్మ వేసిన నాలుగో ఓవర్లో నరైన్ 6,6,4,0,6,4 తో మొత్తం 26 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్లో 12, ఆరో ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. సాల్ట్ 4 ఫోర్లతో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. పవర్ ప్లేలో సాల్ట్ ఔటైనా.. నరైన్ విధ్వంసం ఆగలేదు. అతనికి తోడు రఘువంశీ మెరుపులు మెరిపించడంతో మొదటి 10 ఓవర్లలోనే జట్టు స్కోర్ 135 పరుగులు చేసింది. 

స్వల్ప వ్యవధిలో నరైన్, రఘువంశీ ఔటయ్యారు. నరైన్ 39 బంతుల్లో 7 ఫోర్లు 7 సిక్సులతో 85 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే 27 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సులతో 54 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఇక ఇక్కడ నుంచి రస్సెల్ తన బ్యాట్ కు పని చెప్పాడు. అయ్యర్ తో 24 బంతుల్లోనే 56 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర వరకు మెరుపులు మెరిపించి రస్సెల్ 19 బంతుల్లోనే 3 సిక్సులు, నాలుగు ఫోర్లతో 41 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక రింకూ సింగ్ 8 బంతుల్లోనే 3 సిక్సులు ఒక ఫోర్ తో 26 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో నోకియా మూడు వికెట్లు తీసుకోగా.. ఇషాంత్ శర్మ 2 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలో వికెట్ తీసుకున్నారు.