న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పదేండ్ల శిక్షను సస్పెండ్ చేయాలని కోరుతూ సెంగార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో రిలీఫ్ ఇచ్చేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని కామెంట్ చేసింది.
ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసులో సెంగార్‌కు ట్రయల్ కోర్టు పదేండ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ శిక్షను సస్పెండ్ చేసి, బెయిల్ ఇవ్వాలని కోరుతూ సెంగార్ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన జస్టిస్ రవీందర్ దుడేజా.. పిటిషన్‌ను తోసిపుచ్చారు.
