అప్ డేట్ మామూలుగా లేదుగా : ఐస్ క్రీం బండిపై సోలార్ ప్యానెల్స్..

అప్ డేట్ మామూలుగా లేదుగా  : ఐస్ క్రీం బండిపై సోలార్ ప్యానెల్స్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ హల్‌చల్ చేస్తోంది. సోలార్ ప్యానెల్స్‌తో కూడిన ఢిల్లీ ఐస్ క్రీం ట్రక్ ఇప్పుడు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. 'r/ఢిల్లీ' పేరుతో రెడ్డిట్ సబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ చిత్రంలో.. ఒక వీధిలో 'మహాలక్ష్మి' ఐస్‌క్రీం ట్రక్‌.. దాని పైన సోలార్ ప్యానెల్స్‌తో కనిపిస్తోంది. ఇది ఆన్‌లైన్‌ యూజర్స్ ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఐస్ క్రీం వ్యాపారి సోలార్ ప్యానెల్‌ను కొనుగోలు చేయగలడనే వాస్తవం ఇక్కడ చాలా మందికి షాక్ కు గురిచేస్తోంది.

ఇంతకీ అతను ఈ ట్రక్ పై సోలార్ ప్యానెల్స్ ను ఎందుకు పెట్టాడా అనుకుంటున్నారా.. అదేనండి ఐస్‌క్రీమ్‌ల అంటే చల్లగా ఉంటేనే కదా మజా వచ్చేది. అలా ఉండాలంటే పెద్ద మొత్తంలో పవర్ అవసరం ఉంటుంది కదా. అందుకే వ్యాపారి ఈ పని చేశాడు. వేసవిలో ఐస్‌క్రీం అమ్మడం చాలా కష్టమైన పని. ఈ డెజర్ట్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉండే సమయం కూడా ఇదే. విక్రేతలు క్రమం తప్పకుండా ఉపయోగించే గ్లైకాల్ ఫ్రీజర్ కు భారీ ధర ఉంటుంది. దానికి పెద్ద మొత్తంలో పవర్ కూడా అవసరం. అలాంటి సమయంలో ఈ సోలార్ ప్యానెల్లు సహాయపడతాయి.

ఈ చిత్రం వైరల్‌ కావడంతో నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. “ఇది సరిగ్గా యాజమాన్య వ్యాపారం. ప్రధాన యజమాని తప్పనిసరిగా 10 లేదా అంతకంటే ఎక్కువ వాహనాలను కలిగి ఉండాలి. వారు సాధారణంగా అలాంటి వాటిని కొనుగోలు చేయడానికి నిధులు కలిగి ఉంటారు” అని ఒక Reddit యూజర్ అన్నారు. “మీ ఇంటిపై సోలార్ ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తోంది, అవును ఇది మీకు భారీగా ఖర్చు అవుతుంది కానీ ప్రభుత్వం దాని కోసం సబ్సిడీని కూడా అందిస్తోంది" అని మరొక యూజర్ పంచుకున్నారు.