ఢిల్లీ లిక్కర్ స్కాం..అరుణ్ రామచంద్ర పిళ్లైకి సుప్రీంలో చుక్కెదురు

ఢిల్లీ లిక్కర్ స్కాం..అరుణ్ రామచంద్ర పిళ్లైకి సుప్రీంలో చుక్కెదురు
  •    మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు వెళ్లాలని సూచన

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్‌‌‌‌‌‌‌‌ రామచంద్ర పిళ్లైకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పిళ్లై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను సోమవారం జస్టిస్‌‌‌‌‌‌‌‌ అభయ్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.ఓకా, జస్టిస్‌‌‌‌‌‌‌‌ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

 పిళ్లై తరఫున సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి, ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కాగా, మెడికల్‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్లను చూపి మధ్యంతర బెయిలు కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. తాను పెట్టుకున్న పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.