ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. అభిషేక్ బెయిల్ పిటిషన్ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. అభిషేక్ బెయిల్ పిటిషన్ వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడిగా దర్యా ప్తు సంస్థలు ఆరోపిస్తున్న అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్​పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 20కి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ... అభిషేక్  సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ పిటి షన్ సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు రాగా, ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై 2 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆ సమాధానంపై రిజాయిండర్ దాఖలు చేసేందుకు అభిషేక్​కు మరో 3 వారాల సమయం కేటా యించింది.

ఈ పిటిషన్​ను మరోసారి శుక్రవా రం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టితో కూడిన బెంచ్​ విచారించింది. పిటిష నర్ తరఫు సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహ త్గి వాదనలు వినిపిస్తూ... పంకజ్ బన్సల్ వ ర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అంశాలను లేవనెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా అభిషేక్​ను అరెస్ట్ చేశారని అన్నారు. అరెస్టుకు గల కారణాలను లిఖితపూర్వకంగా ఈడీ అందించాలని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొ న్న విషయాన్ని బెంచ్ దృష్టికి తెచ్చారు. దోషి అయితే మాత్రమే అరెస్ట్ చేయాలని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) చెబుతోందన్నారు. ఈ సందర్భంగా పీఎంఎల్ఏ సెక్షన్ 19 (2) లోని అంశాలను చదివి వినిపించారు. పిటిషన్​పై తదుపరి విచారణ 20న చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా వెల్లడించారు.