ఢిల్లీ లిక్కర్ స్కామ్..కవిత పిటిషన్ విచారణ 28కి వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్..కవిత పిటిషన్ విచారణ 28కి వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర దర్యాప్తు సంస్థలు మహిళలను ఆఫీసుల్లో కాకుండా, ఇంట్లోనే విచారించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలోని తమ ఆఫీసుకు రావాలంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన సమన్లను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సీఆర్పీసీ, మనీలాం డరింగ్ యాక్ట్ 50 ప్రకారం.. మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. సోమవారం కవిత పిటిషన్​ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు లియాతో కూడిన బెంచ్ శుక్రవారానికి వాయిదా వేసింది.