వేధింపులు తట్టుకోలేక అత్తింటికి విషం పెట్టిన అల్లుడు

వేధింపులు తట్టుకోలేక అత్తింటికి విషం పెట్టిన అల్లుడు

న్యూఢిల్లీ: నియంత సద్దాం హుస్సేన్ గురించి వినే ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులను చంపడంలో సద్దాం ఓ వ్యూహాన్ని ఫాలో అవుతాడు. స్లో పాయిజన్‌‌ను ఉపయోగించి తన ప్రత్యర్థులను ఆయన హతమారుస్తుంటాడు. ఈ విషయంలో ఢిల్లీలోని 37 ఏళ్ల వరుణ్ అరోరా అనే వ్యక్తి సద్దాం హుస్సేన్ నుంచి స్ఫూర్తి పొందాడట. అత్తింటి వేధింపులు తట్టుకోలేకపోయిన వరుణ్.. భార్య దివ్య ఫ్యామిలీకి విషం ఇచ్చి చంపాలని చూశాడు. ఫిష్ కర్రీలో తల్లియం పాయిజన్‌‌ను కలిపి దివ్య ఫ్యామిలీకి వడ్డించాడు. 

ఈ ఘటనలో వరుణ్ అత్త అనితా దేవీ శర్మతోపాటు మరదలు ప్రియాంక మృతి చెందారు. వరుణ్ భార్య దివ్యతోపాటు ఆమె తండ్రి దేవేందర్ మోహన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటపై విచారణ జరుపుతున్న పోలీసులు అనితా దేవీతోపాటు దివ్య  రక్తంలో తల్లియాన్ని గుర్తించారు. తాను విష ప్రయోగానికి పాల్పడ్డాడనని పోలీసులు విచారణలో నిందితుడు వరుణ్ ఒప్పుకున్నాడు. తల్లియం వల్ల వాంతులు, డయేరియా, జుట్టు ఊడటంతోపాటు నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులు, గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.