ఉద్యోగం చేస్తానన్న కోడలిపై.. అత్తింటి వాళ్లు..

ఉద్యోగం చేస్తానన్న కోడలిపై.. అత్తింటి వాళ్లు..

ఢిల్లీలో దారుణం జరిగింది. తన భర్తకు బాసటగా ఉండాలనుకున్న ఓ మహిళను ఆమె మామ ఇటుక రాయితో తల పగలకొట్టాడు. ఈ ఘటనలో మహిళకు తీవ్రగాయలయ్యాయి. ఢిల్లీలో ప్రవీణ్ కుమార్, కాజల్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరితో పాటుగా ప్రవీణ్ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉంటున్నారు. అయితే ప్రవీణ్ ఒక్కడే జాబ్ చేసి కుటుంబాన్ని పోషించడం చూడలేకపోయిన కాజల్.. తన భర్తకు అండగా నిలవాలనుకుంది. అయితే ఆమె తీసుకున్న ఈ  నిర్ణయం ఆమె మామకు నచ్చలేదు.

అతను వద్దని ఎంత చెప్పిన కాజల్ వినిపించుకోలేదు. ఇంటర్వ్యూ కోసం వెళ్తున్న కాజల్ ను అడ్డుకున్నాడు. కాజల్ అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది, దీంతో పక్కనే ఉన్న ఇటుకతో ఆమెను వెంబడించి మరి బలంగా బాదాడు. దీంతో కాజల్ కు తీవ్ర గాయాలయ్యాయి.  ప్రవీణ్ ఆమెను సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించాడు.   ఆమెకు 17 కుట్లు పడ్డాయి.  ఫరీదాబాద్‌లో ఉంటున్న కాజల్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాజల్ మామపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.