
పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా.. మెట్రో రైళ్లో కొందరు చేసే చేష్టలు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC)కు తలనొప్పిగా మారుతున్నాయి. తాజాగా వైరల్ అవుతోన్న వీడియోనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
ఢిల్లీ మెట్రోలో ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, పట్టుకోవడం వంటి పలు జంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో బయటికొస్తూనే ఉన్నాయి. ఈ సంఘటనలను నివారించడానికి, DMRC మెట్రో లోపల ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కూడా మోహరించింది. కానీ తాజా సంఘటనను చూస్తోంటే.. అలాంటి వాటిని నియంత్రించడంలో వారు విఫలమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, ఒక వీడియో ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతోంది. అందులో ఒక జంట మెట్రోలో ముద్దు పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఢిల్లీ మెట్రో ఫ్లోర్‌పై ఓ జంట ఒకరినొకరు ముద్దుపెట్టుకున్న ఈ వీడియో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక అబ్బాయి నేలపై కూర్చుని, తన ప్రియురాలిని తన ఒడిలో పడుకోబెట్టుకోవడం చూడవచ్చు. ఏ మాత్రం తడబడకుండా ఇద్దరూ లిప్ లాక్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు ట్విట్టర్‌లో ఈ జంటపై విమర్శలు గుప్పించారు. Breakingnews "The Rock" New #Viralvideo from Delhi Metro... వంటి పేర్లతో ఈ వీడియోను పలు సోషల్ మీడియాల్లోనూ షేర్ చేస్తున్నారు. వీడియోపై స్పందిస్తూ.. ఢిల్లీ మెట్రో పేరును P0rnHubగా ఎందుకు మార్చకూడదు అంటూ యూజర్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. "OMG WHAT" ఇది ??" అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. అదే సమయంలో, కొంతమంది అమ్మాయి మద్యం మత్తులో ఉన్నట్లు భావించారు.
https://twitter.com/avnendra_s/status/1656129523761442816