
ఢిల్లీ మెట్రో జర్నీ కొంతమందికి చిరాకు పుట్టిస్తుంటే మరికొంతమందికి ఎంటర్ టైన్ మెంట్ కలుగజేస్తుంది. సోషల్ మీడియాలో నిత్యం ఢిల్లీ మెట్రో వైరల్ అవుతున్నాయి. రొమాన్స్, జిమ్నిస్టిక్స్ చేయడం, పావుగంట ప్రయాణానికి జుట్లు పట్టుకొని కోవడం ఇలా రక రకాల వీడియోలు వైరల్ అయ్యాయి. ఢిల్లీ మెట్రో అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా తరచూ ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడంలేదు. ఇప్పుడు తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియో ప్రియా సింగ్ అనే యువతి ఈ వీడియోను ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఇది అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారింది. ఒక అబ్బాయి... ఒక అమ్మాయితో ఘర్షణ పడుతున్న ఈ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది. ఈ అమ్మాయి కూడా తానేమీ తక్కువ కాదన్నట్లుగా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు ఉంది. ఈ గొడవ కాస్త చిలికి చిలికి గాలివానగా మారుతున్న సమయంలో మరో మహిళ వచ్చి ఆ అబ్బాయిని ఆపుతుంది. గొడవ ఆపాలని చెప్పి అతడిని శాంతింపజేస్తుంది.
ఈ గొడవ సర్దుమణిగిన తరువాత ఇంకో అమ్మాయి అమ్మాయి నీదే తప్పు అంటూ ఆ అబ్బాయితో వాదిస్తుంది. దీంతో ఆ అబ్బాయి మరో మహిళతో కూడా గొడవపడతాడు.
వివాదాలకు అడ్డాగా మారిన మెట్రో నుంచి మరో వీడియో కూడా రావడంతో నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. రొమాన్స్, గొడవలు అన్నీ ఎంటర్ టైన్ మెంట్లు చూడొచ్చు అంటూ కామెంట్ చేస్తున్నారు. చాలా మంది ఆ అబ్బాయి మీద ఫైర్ అవుతున్నారు. అమ్మాయిలతో అలా గొడవపడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడుతున్నారు. అతడిని పోలీసులకు అప్పగించాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు.
दिल्ली मेट्रो का नया वीडियो आया है pic.twitter.com/u9P9Q3vPWq
— Priya singh (@priyarajputlive) August 25, 2023