న్యూఢిల్లీ: లైక్స్, వ్యూస్ కోసం ఇష్టారీతిన వ్యవహరించే కంటెంట్ క్రియేటర్లకు ఢిల్లీ మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ మెట్రోలో రీల్స్, షార్ట్స్ చేయడం ఆపేయాలని.. సినిమాల్లో చూపించే మాదిరిగా ఓవరాక్షన్ చేయొద్దని హెచ్చరించింది. ప్రయాణకులకు అసౌకర్యం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల కంటెంట్ క్రియేటర్ నిఖిల్ కోచర్ తన ఫోన్‌ను ఢిల్లీ మెట్రో రైలుకు అద్దానికి అతికించి కదులుతున్న రైలు పక్కనే అలాగే పరిగెత్తాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా మిలియన్ల వ్యూ్స్, లైక్స్ వచ్చాయి. క్రమంగా ఇది ఒక ట్రెండ్ మారింది. ఈ క్రమంలోనే నందిని శుక్లా అనే మరో క్రియేటర్ కూడా అదే తరహా రీల్‌ను చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్‌గా మారి ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ దృష్టికి వెళ్లాయి. దీనిపై మెట్రో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కదులుతున్న మెట్రో రైళ్లలో లేదా వాటి పరిసరాల్లో అలాంటి వీడియోలను చిత్రీకరించవద్దని కంటెంట్ క్రియేటర్లను హెచ్చరించింది. ప్రయాణికులకు ఇబ్బంది కల్గించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ మెట్రోలో కంటెంట్ క్రియేటర్లు ఆగడాలు మితీమీరిపోతున్నాయని ప్రయాణికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో ఇష్టారీతిన వ్యవహారించే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.
►ALSO READ | భార్యను స్కూల్ నుంచి తీసేశారని.. సాంబార్లో పేడ కలిపాడు!
