న్యూఢిల్లీ: పాపులర్ వెబ్ సిరీస్ మనీ హీస్ట్‌లోని పాత్రల పేర్లను తమ పేర్లుగా పెట్టుకుని ముగ్గురు వ్యక్తులు ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడ్డారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వందలాది గ్రూప్‌లను మేయింటేన్ చేశారు. స్టాక్ మార్కెట్ చిట్కాలు, డబ్బును రెట్టింపు చేసే ఐడియాలు వంటి పేర్లతో వందలాది మందిని చీట్ చేశారు. ముగ్గురు కలిసి జనాల నుంచి మొత్తంగా రూ.150 కోట్లు లూటీ చేశారు. ఆన్‌లైన్ బిజినెస్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజల నుంచి మరో 23 కోట్ల దోచేశారు. ఆ ముగ్గురు సైబర్ నేరగాళ్లను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అర్పిత్, ప్రభాత్, అబ్బాస్‌గా నిందితులను గుర్తించారు.
నిందితులకు చైనా మాఫియా కనెక్షన్!
నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే థ్రిల్లర్ మనీ హీస్ట్ సిరీస్‌నే వాళ్లు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు. ఆ సిరీస్‌లోని పాత్రల పేర్లతోనే సోషల్ మీడియాలో గ్రూప్‌లను ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్‌లలో చేరిన వందలాది మంది నుంచి లక్షల్లో పెట్టుబడులు పెట్టించారు. మొదట్లో కొంతమందికి ప్రాఫిట్స్ చూపించి నమ్మించారు. ఆపై ఎక్కువ మొత్తం డబ్బు వీళ్ల ఖాతాలో వేసినవాళ్ల అకౌంట్లను బ్లాక్ చేసేవాళ్లు. అలా కోట్లాది రూపాయలు డబ్బు దోచేశారు. ఎదురు ప్రశ్నించినవాళ్లలో 300 మందిని బ్లాక్ మెయిల్ చేసి మరింత డబ్బు డిపాజిట్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
లగ్జరీ హోటల్స్ ఉంటూ మొబైల్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించి మోసాలకు పాల్పడ్డారని వివరించారు. నిందితుల నుంచి 11 మొబైల్ ఫోన్లు, 17 సిమ్ కార్డులు, 12 బ్యాంక్ పాస్ బుక్‌లు, 32 డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేరగాళ్ల వెనక చైనా సైబర్ మాఫియా నెట్‌వర్క్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
