వాటే ఐడియా : కోతులను తరిమేయటానికి.. చింపాజీ ఫ్లెక్సీలు పెట్టారు

వాటే ఐడియా : కోతులను తరిమేయటానికి.. చింపాజీ ఫ్లెక్సీలు పెట్టారు

దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా చింపాజీ ఫ్లెక్సీలు దర్శనిమిస్తున్నాయి.  సెప్టెంబర్ 9,10 తేదీలో ఢిల్లీలో జీ20 దేశాల కూటమి  సమావేశాలు జరుగుతున్నాయి.  ఈ సమావేశాలకు వివిధ దేశాల ప్రతినిథులు హాజరుకానున్నారు.  పలు దేశాల అధినేతలకు చింపాజీ ఫ్లెక్సీలు స్వాగతం పలకనున్నాయి.  జీ 20 సమావేశాలకు.. లంగూర్ ఫ్లెక్సీలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం.  ..

ఈ ఏడాది భారత్ లో జీ-20 కూటమి సమావేశాలు జరనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమావేశాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తోంది భారత ప్రభుత్వం. అయితే ఈ సమావేశాలకు కోతులు ఇబ్బందికరంగా మారాయి. ఢిల్లీలో సాధారణంగా కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది.  ఢిల్లీలో ఉన్న చారిత్రక ప్రదేశాలలో కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

దేశ రాజధానిలో జరుగనున్న ప్రపంచ సదస్సు కోసం కేంద్రంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం సుందరీకరణ పనులతోపాటు అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కోతుల బెడదను నివారించేందుకు లంగూర్ కటౌట్‌లు ఏర్పాటు చేశారు. అలాగే లంగూర్‌ల మాదిరిగా అరిచి కోతులను తరిమేందుకు శిక్షణ పొందిన 40 మంది వ్యక్తులను కూడా లంగూర్‌ కటౌట్ల వద్ద ఉంచుతున్నారు.  జీ20 అతిథుల కాన్వాయ్‌లకు ఆ ప్రాంతంలోని కోతుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు

జీ 20 సమ్మిట్‌ (G20 Summit)కు హాజరయ్యే అతిథులకు లంగూర్ కటౌట్లు (langur cutouts) స్వాగతం పలుకనున్నాయి. అంతేకాదు ఆ కటౌట్ల వద్ద ఉండే వ్యక్తులు లంగూర్‌ మాదిరిగా శబ్దాలు కూడా చేయనున్నారు. జీ20 సదస్సుకు కోతుల బెడద లేకుండా ఉండేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. జీ20 కూటమికి ప్రస్తుతం భారత్‌ అధ్యక్షత వహిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్‌ 9 , 10  రెండు రోజుల పాటు  జీ20 శిఖరాగ్ర సమావేశాలు జరుగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సహా పలు దేశాల అధ్యక్షులు ఈ సమ్మిట్‌కు స్వయంగా హాజరవుతున్నారు.

జీ-20 సమావేశాలను భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా వీటి వల్ల ఎవరికి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతుంది.  జీ-20 సమావేశాల సందర్భంగా విదేశీ అతిధులకు కోతుల వల్ల ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చూసేందుకు న్యూఢిల్లీమున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) సిద్ధమైంది. అటవీ శాఖ సిబ్బందితో కలిసి చర్యలు ప్రారంభించింది. జీ-20 సమావేశాలు జరిగే వేదిక వద్ద, విదేశీ అతిధులు ఉండే హోటల్స్ వద్ద విదేశీ అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు  తీసుకుంటున్నారు.

 అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీఅరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా సభ్యత్వం కల్గి ఉన్నాయి. ప్రపంచ జీడీపీ లో 85% కలిగి ఉన్న జీ-20 దేశాలు ప్రపంచ వాణిజ్యంలో 75% పైగా వాటా కలిగి ఉన్నాయి. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల మంది జీ-20 దేశాల్లో నివసిస్తున్నారు. ఉన్నారు. ఈ సమావేశాలు మొదట్లో ఇండోనేషియాలో నిర్వహించాలని భావించినా, కొన్ని కారణాలతో వీటిని భారత్ లోని ఢిల్లీలో నిర్వహించనున్నారు.