ఢిల్లీలో హై అలర్ట్ : 10 వేల పోలీసులు.. 700 కెమెరాలు

ఢిల్లీలో హై అలర్ట్ : 10 వేల పోలీసులు.. 700 కెమెరాలు
  • ఇండిపెం​డెన్స్​ డే వేళ భద్రత కట్టుదిట్టం

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర వేడుకలు జరిగే ఎర్రకోటతోపాటు ఐజీఐ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మాల్స్, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో సహా పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు.10 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది, 3 వేల మందికి పైగా ట్రాఫిక్ పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 

అదనపు పోలీసు బృందాలను, పారామిలటరీ బలగాలను కూడా మోహరించారు. ఢిల్లీలోని ప్రధాన జంక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో, ఎర్రకోటకు వెళ్లే రోడ్లతోపాటు పలు ముఖ్య ప్రాంతాల్లో 700 ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి, ఇతర వీవీఐపీ అతిథుల భద్రత కోసం మల్టిపుల్ లేయర్ సెక్యూరిటీని నియమించినట్లు అధికారులు వెల్లడించారు. ఏఐ కెమెరాలకు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్ చేశామని.. దీనిద్వారా వేడుకల్లో పాల్గొన్నవారిని పోలీసులు ఈజీగా గుర్తిస్తారని వివరించారు. 

ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘటనతో మరింత అప్రమత్తం

ఎర్రకోట వద్ద భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఇటీవల సమావేశం నిర్వహించామని అధికారులు వెల్లడించారు. ఈ మీటింగులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై జరిగిన హత్యాయత్నం ఘటన, ఢిల్లీలో వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్టుపై కూడా చర్చించామన్నారు. టెర్రరిస్టుల నుంచి ప్రమాదం ముంచి ఉన్నదనే సమాచారంతోనే  కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. 

ఎట్టిపరిస్థితుల్లోనూ సెక్యూరిటీలో లోపం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. హోటళ్లు, గెస్ట్ హౌస్ లు, పార్కింగ్ స్థలాలు, రెస్టారెంట్లను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నెల 16 వరకు దేశ రాజధానిలో పారాగ్లైడర్లు, హ్యాంగ్-గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వంటివి ఎగరడాన్ని నిషేధించినట్లు అధికారులు పేర్కొన్నారు.