నెల ముందు నుంచే స్వాతంత్ర్య దినోత్సవ ఆంక్షలు..

నెల ముందు నుంచే స్వాతంత్ర్య దినోత్సవ ఆంక్షలు..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జులై 22 నుండి ఆగస్టు 16వ తేదీ వరకు పారా-గ్లైడర్లు, పారా-మోటార్లు, హ్యాంగ్-గ్లైడర్లు, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హాట్ ఎయిర్ బెలూన్‌లను ఎగురవేయడాన్ని నిషేధించారు. చిన్న సైజు పవర్డ్ ఎయిర్‌క్రాఫ్ట్, క్వాడ్‌కాప్టర్లు, విమానం నుండి పారా జంపింగ్ చేయడాన్ని కూడా ఢిల్లీ పోలీసులు నిషేధించారు. జూలై 22 నుండి ఆగస్టు 16 వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

ఢిల్లీలో ప్రతిఏటా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు నెలరోజుల ముందు నుంచి ఢిల్లీని జల్లెడ పడుతుంటారు. అనుమానస్పద వ్యక్తులను, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వ్యక్తులను ముందుగానే అదుపులోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఉగ్రవాద చర్యలపై నిఘా వేస్తారు. దేశ ప్రజలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతేకాదు.. రద్దీ ఉండే ప్రాంతాల్లో వాహనాలను తనిఖీలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఢిల్లీ పోలీసులు పలు ఆంక్షలు విధించారు.