కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోని పోలీసు విభాగానికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ. 12,503.65 కోట్లు కేటాయించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 4.79 శాతం ఎక్కువ. గత ఏడాది 2025–-26లో రూ. 11,931.66 కోట్లు కేటాయించింది.
ఈ నిధులను సాధారణ ఖర్చులతో పాటు ఎన్‌సీఆర్ ప్రాంతంలో ట్రాఫిక్ వ్యవస్థ అభివృద్ధి, మెరుగైన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌తో సహా వివిధ పథకాల కోసం ఉపయోగించనున్నారు. ట్రాఫిక్ నిర్వహణ, ఢిల్లీలో శాంతిభద్రతలు, కమ్యూకేషన్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించడం, తాజా సాంకేతికతను చేర్చడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర అంశాలకు కూడా వీటిని వినియోగించనున్నారు.
సీవీసీకి రూ.54 కోట్లు
కేంద్రం బడ్జెట్‌లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కు రూ.54.56 కోట్లు కేటాయించింది. పోయినేడాది రూ.52.07 కోట్లు కేటాయించగా, ఈసారి నిధులు పెంచింది. ఇక యాంటీ కరప్షన్ అంబుడ్స్‌మన్ లోక్‌పాల్‌కు రూ.30 కోట్లు అలకేట్ చేసింది. పోయినేడాది రూ.44.32 కోట్లు కేటాయించగా, ఈసారి నిధులు తగ్గించింది.
