దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు

దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూపీలోని గురుగ్రామ్ లో రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. వాహనాలు ఎక్కిడకక్కడ నిలిచిపోయాయి. దీంతో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇచ్చారు. భారీ వర్షాలకు ఉరుములు, గోడలు కూలడం, ఇళ్లు ధ్వంసం అవడం లాంటి ఘటనతో ఇప్పటివరకు 13 మంది చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఫిరోజాబాద్ లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలోనూ వరద ప్రభావం కనిపిస్తోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఎక్స్ ప్రెస్ వేలో వరద నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

మరోవైపు హర్యానాలో కూడా భారీగా వానలు పడుతున్నాయి. అంతేకాదు వచ్చే రెండ్రోజుల పాటు భారీగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హర్యానాలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.మోకాలి లోతు నీటిలోనే ప్రజలు జీవనం సాగిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పలు కాలనీలు జలదిగ్బంధమయ్యయాయి. వరదల వల్ల హైవేలపై భారీగా ట్రాఫిక్ జాం అవుతందని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడటంతో.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిచిపోయిందని ఆవేదన చెందుతున్నారు.