ఢిల్లీ సీఎస్, సర్వీస్ సెక్రటరీ అధికారాలపై ఆంక్షలు

ఢిల్లీ సీఎస్, సర్వీస్ సెక్రటరీ అధికారాలపై ఆంక్షలు

ఢిల్లీ సీఎస్, సర్వీస్ సెక్రటరీ అధికారాలపై ఆంక్షలు
సర్వీసెస్ మినిస్టర్ పర్మిషన్ లేనిదే..ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దు
మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆదేశాలు

 న్యూఢిల్లీ : స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా చీఫ్ సెక్రటరీ, సర్వీస్​ డిపార్ట్​మెంట్ సెక్రటరీ అధికారాలపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈమేరకు గురువారం ఢిల్లీ సర్వీసెస్ మినిస్టర్ సౌరభ్ భరద్వాజ్ ఆదేశాలు జారీ చేశారు. సర్వీసెస్ మినిస్టర్ ఆమోదం లేకుండా చీఫ్ సెక్రటరీ లేదా సెక్రటరీ (సర్వీసెస్) లేదా సర్వీసెస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఏ కేటగిరీ ఉద్యోగులకు సంబంధించిన ఆర్డర్లు జారీ చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ ఆర్డర్​పై కచ్చితంగా సర్వీసెస్ మినిస్టర్ సంతకం ఉండాల్సిందేనన్నారు.  కాగా, ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా ఉన్న నరేశ్ కుమార్ ​ను ట్రాన్స్​ఫర్ చేసేందుకు ఆప్  ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్రం అనుమతి కోరింది. సీఎస్ నరేశ్ ఈ ఏడాది చివర్లో రిటైర్ కానుండటంతో ఆయన స్థానంలో 1989 ఐఏఎస్ బ్యాచ్​కు చెందిన ప్రవీణ్ కుమార్ గుప్తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కోరుతూ గురువారం సీఎం కేజ్రీవాల్ ఎల్జీకి లేఖ రాశారు.   

లేడీస్ కు బస్సు ఆపకుంటే చర్యలు: కేజ్రీవాల్  

మహిళలను చూసి కొందరు డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. మహిళలను ఎక్కించుకోకుండా వెళ్లిపోతున్న ఓ బస్సుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో ఆయన పోస్టు చేశారు. ఆ బస్సు డ్రైవర్​ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్టు ప్రకటించారు. మహిళా ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవన్నారు. మహిళలకు ఫ్రీ జర్నీ ఫెసిలిటీ కల్పించినప్పటి నుంచి డ్రైవర్లు వాళ్లని చూసినా    ఆపకుండా వెళ్లిపోతున్నారని ఫైర్ అయ్యారు.