- ఏఐఏడబ్ల్యూయూ11వ మహాసభల్లో సీపీఎం నేతలు
న్యూఢిల్లీ, వెలుగు: నియోజకవర్గాల డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసే కుట్రలు జరుగుతున్నాయని సీపీఎం జాతీయ సీనియర్ నాయకురాలు సుభాషిణి అలీ, ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, కార్యదర్శి విక్రమ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన కాకుండా, అన్ని రాష్ట్రాలకూ సమాన న్యాయం జరిగేలా సీట్ల పెంపు ఉండాలని వారు డిమాండ్ చేశారు. ఆదివారం జరిగిన రాష్ట్ర ఏఐఏడబ్ల్యూయూ 11వ మహాసభల సందర్భంగా వారు ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
డీలిమిటేషన్‌తో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టి, అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం జరుపుకుంటున్న పాలనా సంబరాలు దేశ ప్రజలవి కావని.. అవి కేవలం కార్పొరేట్ గుత్తాధిపతులవి మాత్రమేనని నేతలు ఫైర్ అయ్యారు.
