ఏ టిఫినైనా రూ.20కే..ఇంటికి డెలివరీ ఫ్రీ

ఏ టిఫినైనా రూ.20కే..ఇంటికి డెలివరీ ఫ్రీ

కొడెపాక మొగిలి– భాగ్యలక్ష్మి దంపతులది రేగొండ మండలం కోటంచ గ్రామం.చాలా రోజులపాటు బతికే దారి లేక ఎన్నోకష్టాలు పడ్డా రు. ఆకలితో కడుపు మాడ్చుకున్నరోజులూ ఎన్నో ఉన్నాయి. అలాం టి రోజుల్లోమొగిలికి పరకాలలో ఒక హోటల్లో పనిదొరికింది. ప్రతి రోజు టేబుళ్లు క్లీన్‌‌ చేసేవాడు.ఖాళీ టైంలో అదే హోటల్లో వంట చేయడంనేర్చుకున్నాడు. తర్వాత హన్మకొండ, వరంగల్,హైదరాబాద్ లోని పేరున్న హోటళ్లలో పనిచేశాడు. అన్ని రకాల వంటలు చేయడంనేర్చుకున్నాడు. పరకాల పట్టణానికి చెందినడాక్టర్​ సిరంగి సంతోష్ కుమార్​ ఒకసారితన వంట తిని , బాగుం దని మెచ్చుకున్నాడు.సొంతంగా హోటల్‌‌ పెట్టు కోవడానికి 70 వేలరూపాయలు సాయం చేశాడు. దాం తో 10ఏళ్లక్రితం ‘మొగిలి టిఫిన్‌‌ సెంటర్‌ ’ పెట్టాడు. తాను ఉపాధి పొందడంతోపాటు మరో నలుగురికిపని కల్పించాడు. అప్పటి నుంచి ఇప్పటివరకుఆయన వ్యాపారానికి తిరుగే లేదు. మార్కె ట్‌ లోడిఫరెంట్‌ గా ఉండాలనే ఉద్దేశంతో ఫోన్‌‌లోఆర్డర్‌ తీసుకుని డెలివరీ చేస్తున్నాడు.

ఏదైనా 20కే

మొగిలి టిఫిన్‌‌ సెంటర్‌ లో ఇడ్లీ, వడ, పెసరట్టు ..ఏదైనా 20రూపాయలే. హోం డెలివరీచేసినా.. ఎక్స్‌ ట్రా చార్జ్‌ ఉండదు. అందుకే ఈహోటల్‌‌కు రోజుకు సుమారు 200 ఆర్డర్లువస్తున్నాయి. అన్ని ఖర్చులు పోను రోజుకు 2వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.ఈ హోటల్‌‌ మరో స్పెషా లిటీ ఏంటంటే…ఆదివారం ఇక్కడ పూరీతో పాటు చికెన్ కర్రీకూడా ఇస్తారు. అందుకే మిగతా రోజుల్లోకంటే ఆదివారం చాలా రద్దీగా ఉంటుం ది ఈహోటల్‌‌.

అర్డర్‌ పై అన్నీ

మొగిలి టిఫిన్స్‌ పేరుకు టిఫిన్ సెంటరేఅయినా.. ఆర్డర్‌ పై అన్ని రకాల వంటకాలు సప్లైచేస్తారు. రుచికరమైన పచ్చళ్లకు ఈ హోటల్‌‌ పెట్టిం ది పేరు. ఆర్డర్​పై మామిడి, నిమ్మ,ఉసిరితోపాటు చికెన్, ఫిష్‌‌, మటన్ పచ్చళ్లుకూడా డోర్‌ డెలివరీ చేస్తున్నారు. అంతేకాదుపాలక్ పన్నీర్‌ , పన్నీర్​ బటర్​, వెజిటబుల్బిర్యానీ, ఎగ్ ప్రైడ్​ రైస్.. ఇలా ఏదైనా సరే ఒక్కఫోన్‌‌ కొడితే చాలు పార్శిల్‌‌తో గుమ్మం ముం దుఉంటాడు. అంతేకాదు టిఫిన్ సెంటర్​లోమిగిలిన ఫుడ్‌ ను పార్సిల్ చేసి అనాథాశ్రమాల్లోపిల్లలకు, రోడ్డు మీద తిరిగే దేవుని కోడెలకుపెడుతున్నారు. ఉన్నం తలో ఇతరులకు సాయంచేయడం ఎంతో ఆనందంగా ఉంటుం దనిమొగిలి, భాగ్యలక్ష్మి దంపతులు అంటున్నారు.

ఇంట్ల తిన్నట్టే ఉంటది

ప్రతి రోజు ఇంటికి మూడు పార్సిల్స్తీసుకెళ్తా. శుభ్రతతో పాటు వంటలుమస్త్‌‌ టేస్ట్ ఉంటయి. మూడేళ్లుగాఇక్కడే టిఫిన్‌‌ చేస్తున్నా. ఫోన్చేయగానే పార్సిల్స్ కట్టి ఇంటికిపంపుతరు. మంచి ఫుడ్‌ ఇస్తున్నరు.– జలుగూరి మహేశ్‌