ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ లోన్లకు డిమాండ్​

ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ లోన్లకు డిమాండ్​

బిజినెస్‌‌‌‌డెస్క్‌‌‌‌, వెలుగు: గ్లోబల్‌‌‌‌గా ట్రావెల్‌‌‌‌ రిస్ట్రిక్షన్లు తొలగిపోతుండడంతో విదేశాల్లో చదివేందుకు అప్పులు ఎక్కడ దొరుకుతాయోనని స్టూడెంట్లు వెతుకుతున్నారు. గ్లోబల్‌‌‌‌గా స్కూళ్లు, కాలేజిలు, ఇన్‌‌‌‌స్టిట్యూషన్లు తిరిగి ఓపెన్ అవుతున్నాయి. ఫారిన్‌‌‌‌లో చదివేందుకు  ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌ ఎడ్యుకేషన్ లోన్లను తీసుకోవడానికి స్టూడెంట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లకు సంబంధించిన క్వయిరీస్‌‌‌‌ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో భారీగా పెరిగాయి. కానీ, ఫైనాన్షియల్ సంస్థలు మంజూరు చేసిన ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లు మాత్రం పెద్దగా పెరగలేదని ఎనలిస్టులు చెబుతున్నారు.  కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లు 209 శాతం పెరిగాయని హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ క్రెడిలా ఎండీ అర్జిత్‌‌‌‌ సాన్యాల్‌‌‌‌ అన్నారు.  కాగా, యూఎస్, కెనడా, యూకే, యురోపియన్ దేశాల్లో చదివేందుకు ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. కిందటి నెలలో  యూఎస్‌‌‌‌కు 55 వేల మంది ఇండియన్ స్టూడెంట్లు, ఎక్స్చేంజ్‌‌‌‌ విజిటర్లు ట్రావెల్‌‌‌‌ చేశారు. యూకేలోని వివిధ యూనివర్శిటీల్లోని కోర్సుల కోసం 3,200 మంది స్టూడెంట్లు జాయిన్ అయ్యారు. అంతకుముందటి ఏడాదితో  పోలిస్తే ఇది  19 శాతం ఎక్కువ. 

వడ్డీ రేట్లు తక్కువ..

ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం వడ్డీ రేట్లు తగ్గుతుండడమేనని ఎనలిస్టులు చెబుతున్నారు. గ్లోబల్‌‌‌‌గా టాప్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్లలో జాయిన్ అయ్యే వారికి 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 9.5 శాతం వడ్డీకే ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లను ఫైనాన్షియల్ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. లోన్ అమౌంట్‌‌‌‌ కూడా పెరిగింది. కిందటేడాది సగటున రూ.  30 లక్షల అమౌంట్‌‌‌‌ ఎడ్యుకేషన్ లోన్‌‌‌‌గా ఇవ్వగా, ఈ సారి ఈ అమౌంట్ సైజు రూ. 35 లక్షలకు పెరిగింది. పెంటప్ డిమాండ్‌‌‌‌ (ఒక్కసారిగా డిమాండ్ క్రియేట్ అవ్వడం) వలన  కూడా ఈ టైప్‌‌‌‌ లోన్లు పెరుగుతున్నాయని ఎస్‌‌‌‌బీఐ సీనియర్‌‌‌‌‌‌‌‌ అధికారి ఒకరు అన్నారు. ‘గత కొన్ని నెలల్లో ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్ల డిమాండ్ రెండింతలు పెరిగింది. యూఎస్ కంటే  యూకే, ఐర్లాండ్‌‌‌‌, ఈయూ, సింగపూర్‌‌‌‌లలో పెద్ద చదువులు చదివేందుకు  ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. రష్యా, చెక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌ దేశాల్లో చదివేందుకు కూడా ఆసక్తి పెరగడం చూస్తున్నాం’ అని క్రెడెంక్‌‌‌‌ ఫిన్‌‌‌‌టెక్ కంపెనీ ఫౌండర్‌‌‌‌‌‌‌‌ మయాంక్‌‌‌‌ బతేజా అన్నారు.  కానీ, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌ దేశాలు ఎలా  ఓవర్‌‌‌‌‌‌‌‌సీస్‌‌‌‌ స్టూడెంట్లను అంగీకరిస్తున్నాయో గైడ్‌‌‌‌లైన్స్ అందుబాటులో లేవన్నారు.  ‌‌‌‌ ఇండియాలో తమ బిజినెస్‌‌‌‌ వేగంగా పెరుగుతోందని ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్స్‌‌‌‌ ఇచ్చే కంపెనీ ప్రొడిగి ఫైనాన్స్‌‌‌‌ పేర్కొంది. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి తమ లోన్‌‌‌‌ సెక్షన్‌‌‌‌ 60 శాతం గ్రోత్ సాధించిందని తెలిపింది. ‘సగటు లోన్ అమౌంట్‌‌‌‌ సైజు కూడా  రూ. 30 లక్షల నుంచి 10–15 శాతం పెరిగింది. ట్యూషన్ ఫీజులు పెరుగుతుండడంతో ఎడ్యుకేషన్ లోన్‌‌‌‌ సైజు కూడా పెరిగింది’ అని ప్రొడిగి ఫైనాన్స్‌‌‌‌ ఇండియా హెడ్ మయాంక్ శర్మ అన్నారు. 

ఫారిన్‌‌‌‌లో చదువు..

 బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్లు విదేశాల్లో చదువుకునేందుకు స్టూడెంట్లకు తక్కువ వడ్డీకే లోన్లను ఆఫర్ చేస్తున్నాయి.  కానీ, స్టూడెంట్లు చదవాలనుకునే ఇన్‌‌‌‌స్టిట్యూషన్ లెండర్ల అర్హత లిస్టులో ఉండాల్సి ఉంటుంది. కోర్సు, ఇన్‌‌‌‌స్టిట్యూషన్‌‌‌‌ను బట్టి వడ్డీ రేట్లు, లోన్ అమౌంట్‌‌‌‌లో మార్పులుంటాయి. లోన్‌‌‌‌ను తిరిగి చెల్లించేందుకు గరిష్టంగా 15 ఏళ్ల వరకు కూడా టైమ్‌‌‌‌ ఇస్తున్నారు. కొన్ని ఫైనాన్షియల్ సంస్థలు ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్‌‌‌‌ రూ. 7.5 లక్షలు దాటితే కొలేటరల్‌‌‌‌ అడుగుతున్నాయి. కానీ, ఐఐఎం, ఐఐటీ, హార్వర్డ్‌‌‌‌, కేమ్‌‌‌‌బ్రిడ్జ్‌‌‌‌ వంటి టాప్ ఇన్‌‌‌‌స్టిట్యూషన్లలో సీటు పొందిన వారికి ఈ  కొలేటరల్‌‌‌‌ను కూడా కొన్ని సంస్థలు కోరడం లేదు.  ఇటువంటి ఇన్‌‌‌‌స్టిట్యూషన్ల కోసం లోన్‌‌‌‌ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజులను కూడా రద్దు చేస్తున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత  వెంటనే లోన్‌‌‌‌ను తీర్చాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల పాటు లోన్‌‌‌‌పై మారటోరియాన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. కాగా,  ఇండియన్స్‌‌‌‌కు మాత్రమే ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్‌‌‌‌ను డొమెస్టిక్‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి.

మొండిబాకీలూ పెరుగుతున్నాయ్‌‌‌‌..

కరోనా సంక్షోభం వలన ఎడ్యుకేషన్ లోన్లు మొండిబాకీలుగా మారుతుండడం కూడా పెరుగుతోంది.  ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చిన ఎడ్యుకేషన్ లోన్లలో 9.5 శాతం లోన్లు నాన్‌‌‌‌ పెర్ఫార్మింగ్ అసెట్స్‌‌‌‌గా మారాయని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం రూ. 8,587 కోట్ల విలువైన 3,66,260 అకౌంట్లు ఎన్‌‌‌‌పీఏలుగా మారాయని అప్పుడు ప్రభుత్వం పేర్కొంది. కరోనా వలన జాబ్‌‌‌‌ లాస్‌‌‌‌లు పెరగడం, ఆదాయ మార్గాలు తగ్గిపోవడం వంటి కారణాలతో  లోన్లను చెల్లించడంలో  బారోవర్లు ఇబ్బంది పడుతున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌‌‌‌ ప్రభావం వలన మరిన్ని ఎడ్యుకేషన్‌‌‌‌ లోన్లు ఎన్‌‌‌‌పీఏలుగా మారొచ్చని ఎనలిస్టుల అభిప్రాయపడుతున్నారు.