సెకెండ్ హ్యాండ్ వాటికే గిరాకీ 

 సెకెండ్ హ్యాండ్ వాటికే గిరాకీ 
  • మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ లు, టీవీలకు ఎక్కువ డిమాండ్‌
  • 2020 లో రికార్డ్‌ లెవెల్లో యాక్టివిటీ చూశాం: ఓఎల్‌ ఎక్స్‌

బిజినెస్ డెస్క్, వెలుగు: కొత్త వస్తువులను కొనడం కంటే సెకెండ్ హ్యాండ్లో తీసుకుందామనే ధోరణి పెరుగుతోంది. ముఖ్యంగా ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఏసీలు, టీవీలు వంటి కేటగిరీలలో సెకెండ్ హ్యాండ్ ప్రొడక్టలకు మంచి డిమాండ్ క్రియేట్ అవుతోంది. వర్క్ ఫ్రం హోం, ఆన్ లైన్ ఎడ్యుకేషన్, హోమ్ ఎంటర్టైన్మెంట్ వంటి విధానాలకు ఆదరణ పెరుగుతుండడంతో ఈ ప్రొడక్ట్లలకు డిమాండ్ క్రియేట్ అవుతోంది. మెట్రో సిటీలతో పోలిస్తే సిటీలు, సెమీ సిటీల నుంచి సెకెండ్ హ్యాండ్ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉందని ఆన్లైన్ క్లాసిఫైడ్స్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎక్స్ పేర్కొంది . కరోనా సమస్యలున్నప్పటికీ  2020 లో సెకెండ్ హ్యాండ్ వస్తువులను కొనేందుకు యూజర్లు ఆసక్తి చూపారని తెలిపింది. 2019, 2020 లకు చెందిన సెల్లర్లు, బయ్యర్ల డేటాను ఆధారంగా కంపెనీ ఈ విషయాన్ని బయటపెట్టింది. 2019 తో పోలిస్తే కిందటేడాది తమ ప్లాట్ఫామ్లో బయ్యర్లు భారీగా పెరిగారని ఓఎల్ఎక్స్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. కొత్త వస్తువులు కంటే సెకెండ్ హ్యాండ్ వస్తువులకు ఎక్కువ డిమాండ్ ఉందని, నాన్ మెట్రోల నుంచి డిమాండ్ ఎక్కువగా క్రియేట్ అయ్యిందని ప్రకటించింది. కిందటేడాది చివరి ఆరు నెలల్లో తమ ప్లాట్ఫామ్లో ‘సెల్లర్లు’ భారీగా లిస్టింగ్ అయ్యారని, ముఖ్యంగా ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు వంటి గూడ్స్ను అమ్మడానికి ప్లాట్ఫామ్లో ఎక్కువ మంది లిస్ట్ అయ్యారని తెలిపింది.  2019 తో పోలిస్తే 2020 లో తమ ప్లాట్ఫామ్లో బయ్యర్ల నుంచి 35 శాతం ఎక్కువ డిమాండ్ను చూశామని ఓఎల్ఎక్స్ ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్, మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్, ఫర్నిచర్ వంటి వస్తువులకు 2020 మొదటి నుంచి డిమాండ్ నిలకడగా కొనసాగిందని,  నాన్ మెట్రో సిటీలలోని యూజర్ల వలన  కిందటేడాది చివరి ఆరునెలల్లో సెకెండ్ హ్యాండ్ గూడ్స్కు డిమాండ్ మరింత పెరిగిందని తెలిపింది.  
కరోనా ముందు స్థాయికి సెకెండ్ హ్యాండ్ మార్కెట్...
ఓఎల్ఎక్స్ డేటా ప్రకారం టెక్నాలజీ గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, టీవీలను కొనేందుకు బయ్యర్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అవసరాల కోసం లాక్డౌన్  టైమ్లో కూడా ఈ గూడ్స్కు మంచి డిమాండ్ క్రియేట్ అయ్యింది. పైన పేర్కొన్న ప్రతీ ప్రొడక్ట్ కేటగిరీకి కిందటేడాది రెండో క్వార్టర్(క్యూ2)లో డిమాండ్ సుమారు 100 శాతం పెరగడం విశేషం. అదే మెట్రో సిటీలలో అయితే ట్యాబ్లెట్లకు 98 శాతం డిమాండ్ క్రియేట్ అయ్యింది. మూడో క్వార్టర్(క్యూ3) లో ఎలక్ట్రానిక్స్ అప్లియెన్సెస్, ఫర్నిచర్, మొబైల్స్ వంటి ప్రొడక్ట్ల సెకెండ్ హ్యాండ్ గూడ్స్ డిమాండ్ రెండు రెట్లు పెరిగింది. క్యూ1, క్యూ2 లలో  పూర్తి కాని డీల్స్తోపాటు, హోమ్ ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి విధానాలకు ఆదరణ పెరగడంతో క్యూ3 లో పైన పేర్కొన్న ప్రొడక్ట్లకు భారీగా డిమాండ్ క్రియేట్ అయ్యిందని ఓఎల్ఎక్స్ ప్రకటించింది. కానీ నాలుగో క్వార్టర్లో డిమాండ్ మాత్రం ముందటేడాది క్యూ4 లో ఉన్నంతే నమోదయ్యిందని,  సెకెండ్ హ్యాండ్ గూడ్స్కు డిమాండ్ కరోనా ముందు స్థాయికి వచ్చిందని ఓఎల్ఎక్స్ పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెన్సెస్, గ్యాడ్జెట్ల కేటగిరీలలో కొత్త గూడ్స్ కంటే సెకెండ్ హ్యాండ్ గూడ్స్కు ఎక్కువ డిమాండ్ క్రియేట్ అవ్వడం విశేషం. రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెబుతున్న డేటా ప్రకారం కిందటేడాది సెప్టెంబర్లో ఈ కేటగిరీలలో సేల్స్ ఏడాది ప్రాతిపదికన 2 శాతం పెరిగాయి. అదే అక్టోబర్లో 8 శాతం పెరిగాయి. జులై–సెప్టెంబర్ క్వార్టర్లో కన్జూమర్ కంపెనీల సేల్స్ రికవరీ అయ్యాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు వంటి వస్తువుల కొనుగోళ్లు పెరగడంతో కిందటేడాది అక్టోబర్లో కన్జూమర్ కంపెనీలు2020 కి గాను తమ బెస్ట్ సేల్స్ను నమోదు చేశాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ వంటి విధానాలకు ఆదరణ పెరగడంతో ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్ల సేల్స్ పెరిగాయి.
మెట్రోలు కంటే సిటీలలోనే ఎక్కువ.. 
కరోనా ప్రభావం ఉన్నప్పటికీ కిందటేడాది తమ ప్లాట్ఫామ్లో రికార్డ్ లెవెల్లో యాక్టివిటీని చూశాం. ఏడాది చివరి నాటికి సెకెండ్ హ్యాండ్ గూడ్స్ డిమాండ్ కరోనా ముందు స్థాయికి చేరుకుందని ఓఎల్ఎక్స్ ఇండియా సీఎంఓ సప్నా అరోరా అన్నారు. ప్లాట్ఫామ్లో సెల్లర్ల లిస్టింగ్ బయ్యర్ల లిస్టింగ్తో పోలిస్తే తక్కువగా జరిగిందని, కరోనా ప్రభావంతో తమ ప్రొడక్ట్లను అప్గ్రేడ్ చేసుకోవడానికి సెల్లర్లు ఏడాది ప్రారంభంలో ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. 2020 చివరి ఆరు నెలల్లో ప్లాట్ఫామ్లో సెల్లర్ల లిస్టింగ్ పెరిగిందని, నాన్ మెట్రో సిటీల నుంచి సెల్లర్ల లిస్టింగ్ ఎక్కువగా జరిగిందని ఓఎల్ఎక్స్ పేర్కొంది. 2019 తో పోలిస్తే 2020 లో ఫ్రిడ్జ్లు, ఏసీలు, ల్యాప్టాప్లు అమ్మేందుకు ఎక్కువ మంది తమ ప్లాట్ఫామ్లో లిస్ట్ అయ్యారని తెలిపింది. అన్లాక్ ప్రకటించిన తర్వాత నుంచి వివిధ కేటగిరీలలో సెల్లర్ల లిస్టింగ్ పెరిగిందని ఈ కంపెనీ ప్రకటించింది.