145 మంది ఇండియన్లను వెనక్కి పంపిన అమెరికా

145 మంది ఇండియన్లను వెనక్కి పంపిన అమెరికా

దేశంలోకి అక్రమంగా వలస వచ్చారనే కారణంతో అమెరికా… 145 మంది ఇండియన్లను వెనక్కి పంపించింది. వీరితో పాటు పలువురు శ్రీలంక, బంగ్లాదేశ్ కు చెందిన వారిని కూడా వెనక్కి పంపించేసింది. భారతీయులంతా ఇవాళ ఉదయం (బుధవారం) ఢిల్లీలోని ఇందిగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరంగా గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ ఏజెంట్లను ఆశ్రయించి అమెరికాకు చేరుకున్నారని అమెరికా అధికారులు తెలిపారు. మరికొందరు వీసా గడువు ముగిసినప్పటికీ చట్ట విరుద్ధంగా ఇక్కడే ఉంటున్నారని చెప్పారు. అక్రమ వలసలను అమెరికా అధ్యక్షుడు సీరియస్ గా తీసుకోవడంతో ..అక్కడి అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.