హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకుల సొసై టీలో ఆన్ డ్యూటీ పద్ధతిలో పనిచేస్తున్న టీచిం గ్ స్టాఫ్ డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఇన్‌చార్జ్ సెక్రటరీ శారద ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది కొరత కారణం గా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, హెడ్‌ఆఫీస్‌తో పాటు ఇతర విభాగాల్లో ఓడీ పేరుతో 16 మంది పని చేస్తున్నట్టు గురువారం ఓ ప్రకటనలో సెక్రటరీ తెలిపారు.
తిరిగి వారి పూర్వ స్థానా నికి పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కొంద రు టీచింగ్ సిబ్బంది దీర్ఘకాలంగా హెడ్‌ఆఫీస్‌లోనే కొనసాగుతున్నారనే అంశంపై ఉపా ధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పలు వురు టీచింగ్ సిబ్బంది మంత్రికి ఫిర్యాదు చేశారు.
