మధిర మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మధిర మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
  • పార్టీ శ్రేణులకు డిప్యూటీ సీఎం భట్టి పిలుపు
  • మధిర మున్సిపల్ కీలక నాయకులతో ప్రత్యేక సమావేశం

మధిర, వెలుగు:  ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా  కాంగ్రెస్​ పార్టీ శ్రేణులు పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మధిరకు  వచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి లో మధిర డివిజన్లలోని కాంగ్రెస్ కీలక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఇతర పార్టీలు రెండు మూడు దశాబ్దాల కింద చేసిన రూ.5లక్షల పనిని మైకు దొరికిన ప్రతిసారి చెప్పుకుంటూ పోతారు, కానీ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారంలో వెనుకంజలో ఉండటం మూలంగా ఇబ్బంది ఏర్పడుతున్నామని తెలిపారు. 

మధిర పట్టణం అభివృద్ధి చెందాలి, క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటేనే భవిష్యత్​ తరాలు బాగుపడతాయని ఆలోచించే వ్యక్తులను గెలిపించుకోవాలని  పిలుపునిచ్చారు. మధిర పట్టణానికి కాంగ్రెస్ చేయని పని అంటూ లేదన్నారు.  అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్, చెరువులను టూరిజం పార్కులుగా తీర్చిదిద్దడం, డిగ్రీ, ఇంటర్, హై స్కూల్ విద్యాసంస్థలకు సొంత భవనాలు, అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జనరల్ పాలిటెక్నిక్, ఐటీఐని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ గా మార్చడం, బస్టాండ్, ట్రెజరీ, బ్యాంకులను తీసుకురావడం లాంటి గొప్ప పనులు చేశామని,  ఇవి మున్సిపాలిటీలోని ఓటర్లకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన వెంటనే మధిర నగరం అంతా కొత్త సీసీ రోడ్ల పనులు చేపడుతామని తెలిపాఉ. సమావేశంలో జిలా కాగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, మధిర పట్టణ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణగుప్తా పాల్గొన్నారు.