
హైదరాబాద్, వెలుగు: అల్వాల్, అత్తాపూర్, నాగారంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘నియాన్షీ ఫర్నిచర్స్’ షోరూంలను శనివారం ఒకేసారి ప్రారంభించారు. అల్వాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొని ప్రారంభించారు.
నియాన్షీ ఫౌండర్, సీఈఓ ఆకాశ్ మాట్లాడుతూ.. తమ వద్ద ఎక్కడా లభించని ఎక్స్క్లూజివ్ఫర్నిచర్ అందుబాటులో ఉందని తెలిపారు. త్వరలో తెలంగాణ, ఏపీల్లో మరో ఏడు షోరూములను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.