ఇవాళ ఒడిశాలో భట్టి ప్రచారం

ఇవాళ ఒడిశాలో భట్టి ప్రచారం

హైదరాబాద్, వెలుగు :  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే భట్టి భువనేశ్వర్ చేరుకున్నారు.

 గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొననున్నారు. గత వారం రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఆయన ప్రచారం నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై రాష్ట్ర గీతంపై చర్చించారు. అంతకు ముందు కేరళలో కూడా ప్రచారం నిర్వహించారు.