ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొండ గట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. అర్చకులు సంప్రదాయ బద్దంగా.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రులు అడ్డూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతోపాటు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
ఆలయానికి వచ్చిన వెంటనే.. నేరుగా ఆలయంలోకి వెళ్లి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు పవన్ కల్యాణ్. ప్రత్యేక పూజలు చేశారు. ఆకు పూజతోపాటు స్వామికి ప్రత్యేక హారతి ఇచ్చారు అర్చకులు. ఆలయంలో ఆంజనేయస్వామి దర్శనం తర్వాత.. కొద్దిసేపు ధ్యానం చేశారు పవన్ కల్యాణ్.
