తెలంగాణ బడ్జెట్ లో బీసీల వాటాను పెంచాలి: ఆర్. కృష్ణయ్య

తెలంగాణ బడ్జెట్ లో బీసీల వాటాను పెంచాలి:  ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో బీసీలకు 8 వేల కోట్లు కేటాయించడం సబబేనా..? అని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం కంటే కొంత మెరుగైన బడ్జెట్ అయినప్పటికీ, బీసీలకు కొత్త స్కీమ్ లు ఏమీ లేవన్నారు.  కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

 బీసీలను విస్మరించడం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తప్పిదాలు చేయొద్దని సూచించారు. తక్షణమే బడ్జెట్ లో బీసీలకు  20 వేల కోట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, 12 కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , నేతలు గువ్వల భరత్, టి. రాజ్ కుమార్, నందగోపాల్, అంజి, జయంతి పాల్గొన్నారు.