సాధారణంగా కారులో టిష్యూ బాక్స్‌ని డ్యాష్ బోర్డ్‌పై పెడుతుంటారు. కానీ.. జర్నీలో పెద్ద పెద్ద కుదుపులు వచ్చినప్పుడు అది పదే పదే ఎగిరి కింద పడుతుంటుంది. అందుకే టిష్యూలను ఇలాంటి హోల్డర్లో పెట్టుకుంటే సరిపోతుంది. దీన్ని డిటాచీ అనే కంపెనీ తీసుకొచ్చింది. దీన్ని కారులోని సన్ వైజర్, సీటు వెనుక భాగం లేదా డోర్ ప్యాకెట్స్.. ఇలా ఎక్కడైనా క్లిప్ చేసుకోవచ్చు.
అందుకోసం దీనికి ప్రత్యేకంగా రెండు బలమైన క్లిప్‌లు ఉంటాయి. ఎంత పెద్ద కుదుపులు వచ్చినా అవి ఊడిపోవు. ఇది ఇంటీరియర్‌కు కూడా కొత్త అందాన్ని తీసుకొస్తుంది. ప్రీమియం పీయూ లెదర్ మెటీరియల్‌తో తయారైన ఈ హోల్డర్ చాలాకాలం పాటు మన్నికగా ఉంటుంది. ధర 250 రూపాయలు.
