హైదరాబాద్లో నాన్ స్టాప్ వర్షం.. రిచ్ ఏరియాలో రచ్చ లేపిన వాన.. ఎక్కడెక్కడ ఎంత కురిసిందంటే..

హైదరాబాద్లో నాన్ స్టాప్ వర్షం.. రిచ్ ఏరియాలో రచ్చ లేపిన వాన.. ఎక్కడెక్కడ ఎంత కురిసిందంటే..

హైదరాబాద్ లో వాన బీభత్సం సృష్టించింది. సోమవారం (ఆగస్టు 04) మధ్యాహ్నం మొదలైన వాన నాన్ స్టాప్ గా కురుస్తూ నగరాన్ని ముంచేసింది. కుండపోత అనే పదం కూడా తక్కువే అన్నట్లుగా కురిసిన వానకు నగరంలో ఎక్కడ చూసినా నీళ్లతో వాగులు, చెరువులను తలపించాయి. రోడ్లన్నీ నదులను గుర్తు చేశాయి.

సుమారు గంటకు పైగా వర్షం కురుస్తూనే ఉంది.  పలు ప్రాంతాల్లోమోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ కురిసిన వర్షంలో సిటీలోనే సంపన్న ఏరియాగా పేరున్న  జూబ్లీహిల్స్ లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కంటిన్యూగా జడివాన కురిసినట్లుగా వర్షం దంచికొట్టడంతో మాదాపూర్ లో అత్యధికంగా 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్ మాదాపూర్ లో 12 cm వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటలోగా ఇంత వర్షపాతం నమోదవ్వడం చాలా కాలం తర్వాత నగర వాసులు చూస్తున్నారు.

ALSO READ | హైదరాబాద్ సిటీలో క్లౌడ్ బరస్ట్.. ఆకాశానికి చిల్లు పడ్డట్టు వర్ష బీభత్సం

బంజారీహిల్స్, జూబ్లీహిల్స్ తర్వాత యూసుఫ్ గూడ 11, శ్రీనగర్ కాలనీ 10, ఖైరతాబాద్ 9.9, కూకట్ పల్లి 9.7 సెంటీమీటర్ల వర్షపాతనం నమోదైంది. ఆ తర్వాత వరుసగా మైత్రివనం, అమీర్పేట్  9.2,  బాలానగర్ 8.3,  ఆసిఫ్ నగర్,  బంజారాహిల్స్ వెంకటేశ్వర కాలనీ 7.9 ,  మూసాపేట్ 7.7, అత్తాపూర్ 7.6 ,  బహదూర్ పుర 7.5 ,  కుత్బుల్లాపూర్ 7.4,  రహ్మత్ నగర్ 7.3 ,  నాంపల్లి ఎల్బి స్టేడియం 7.1 ,  గాజులరామారం 7 ,  బండ్లగూడ ఫాతే నగర్ బాలాజీ నగర్ కిషన్ బాగ్, హిమైత్ నగర్,6 cm మెహిదీపట్నంలో 5.3 cm వర్షం కురిసింది.

ఇక  భారీ వర్షం కారణంగా నగరవాసులు బయటికి రావద్దని సిటీ ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా అధికారులు సూచించారు. నాలాలు పొంగుతుండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జాం అవుతున్న కారణంగా.. రోడ్లపైకి వస్తే ట్రాఫిక్ లో ఇరుక్కుంటారని హెచ్చరించారు. వాన నిలిచే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.